బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకానికి ఉద్యోగాన్ని కోల్పోయిన ఎయిర్‌హోస్టెస్‌

బాయ్ ఫ్రెండ్ చేసిన నిర్వాకానికి ఓ మహిళా ఎయిర్‌హో‌స్టెస్ తన ఉద్యోగాన్నే కోల్పోయింది. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది.

Update: 2019-10-22 14:23 GMT

బాయ్ ఫ్రెండ్ చేసిన నిర్వాకానికి ఓ మహిళా ఎయిర్‌హో‌స్టెస్ తన ఉద్యోగాన్నే కోల్పోయింది. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. ప్రయాణంలో భాగంగా.. సింగపూర్‌ హోటల్‌లోని రిసెప‌్షన్ ప్రాంతంలో బ్రిటన్ ఎయిర్‌వేస్ చెందిన ఫైలట్‌లో ఎయిర్‌హో‌స్టెస్ నటాలీ ఫ్లిండాల్ ప్రియుడు పైలట్ పై ఘర్షణకు దిగాడు.

అతను ఫుల్గ్‌గా మద్యం సేవించి గొడవకు దిగినట్లు బ్రిటిష్‌ పత్రిక సన్ పేర్కొంది. నటాలీ ఫ్లిండాల్ తన ప్రియుడిని వెనుక సీటులో కూర్చొవాలని కోరింది. దీంతో అతను అక్కడ ఉన్న సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన పై బ్రిటిస్ ఎయిర్‌వేస్‌ ఆరా తీసింది. కాగా... దీనిలో నటాలీ తప్పు ఉన్నాట్లు తెల్చింది. ఆమెను వృత్తి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ సిబ్బంది క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎయిర్‌వేస్ హెచ్చరించింది. బాయ్ ప్రెండ్ నిర్వాకంతో నటాలీ తన ఉద్యోగాన్ని కోల్పోయింది.

Tags:    

Similar News