బతికున్న కూతురుకే కర్మకాండలు చేసిన తండ్రి ...

Update: 2019-08-05 11:51 GMT

బతికున్న కూతురుకే కర్మకాండలు చేసాడు ఓ తండ్రి .. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది . ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ జిల్లా కుచ్రోడ్ ప్రాంతానికి చెందిన గోపాల్ మండోరా కుమార్తె గత నెల 25న తానూ ప్రేమించిన ఓ యువకుడితో కలిసి ఇంట్లోనుండి వెళ్ళిపోయింది . అయితే తన కూతురు అలా చేయడంతో తన పరువు పోయిందని గోపాల్ మండోరా తీవ్ర ఆవేదన చెందాడు . ఇక తనకి కూతురు ఉన్న లేకున్నా ఒకటేనని కూతురికి కర్మకాండలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడు . ఈ క్రమంలోనే బంధువులు, గ్రామస్థులు రావాలని కార్డులు పంచాడు. మూడు రోజుల క్రితం గోపాల్ మండోరా తన కూతురికి కర్మకాండలు నిర్వహించాడు. అయితే గోపాల్ మండోరా తీసుకున్న నిర్ణయానికి కొందరు మద్దతు పలికితే మరికొందరు మాత్రం మండిపడుతున్నారు .. 

Tags:    

Similar News