కుక్క కరిచిందని ఆసుపత్రికి వెళ్తే వైద్యుడి తలతిక్క సమాధానం ...

Update: 2019-06-30 04:29 GMT

రాజస్థాన్ ; వైద్యో నారాయణో హరి అని పెద్దలు అన్నారు .. అంటే దేవుడి తర్వాత మరో దేవుడు వైద్యుడని అర్ధం .. మరి అలాంటి వైద్యులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఆశ్చర్యం కలగక మానదు . రాజస్థాన్ లోని ఓ మహిళ కుక్క కరిచిందని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది . అక్కడ ఉన్న డాక్టర్ కి తనకు జరిగిన భాదను వివరించింది . దానికి అ డాక్టర్ వైద్యం చేయాల్సింది పోయి.. తలతిక్క సమాధానం ఇచ్చాడు . 'కుక్క కరిచిందా.. అయితే నువ్వు వెళ్లి కుక్కను కరు ' అని సమాధానం ఇచ్చాడు . ఈ ఘటన రాజస్తాన్ లోని అజ్మీర్ లో చోటు చేసుకుంది. అ సమాధానం విన్న మహిళ తీరిగి వైద్యుడిని మీకు ఎప్పుడు కుక్క కరవలేదా అని ప్రశ్నిచింది . దీనితో ఇద్దరి మద్య మాట మాట పెరిగింది . ఈ వ్యవహారాన్ని మొత్తం ఆసుపత్రి సిబ్బంది ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది . 

Similar News