ఎన్నారై భర్తలపై 6 వేల మంది భార్యల ఫిర్యాదు : విదేశాంగ శాఖ

Update: 2019-11-21 13:58 GMT

మనదేశంలో చాలా మంది యువతుల తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను మంచి కుటుంబంలోకి పంపంచాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ అల్లుడు మంచి ఆస్తి, అంతస్తు, ఉద్యోగం కలవాడై ఉండాలి అనుకుంటారు. అంతేకాదు ముఖ్యంగా ఎన్నారై అయితే బాగుంటుంది అనుకుంటుంటారు. ఈ విధమైన ఆలోచలనతో ఉన్నవారే ఎక్కువ శాతం. తమ కూతుళ్ల భవిష్యత్తు భాగుండాలి అనుకుని తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిలని విదేశాలలో ఉండే వారికి కట్టబెడుతున్నారు. తాము విమానమెక్కి విదేశాలకు వెళ్లి ఎంతో ఆనందంగా ఉంటారు అనుకుంటారు. అలా అనుకునే లోపే వారి ఆశలన్నీ అడిఆశలై పోతున్నాయి.

ఎక్కువ శాతం ఎన్నారైలను పెళ్లాడిన వారిలో చాలా మంది మహిళలు తమ భర్తల నుంచి ఎన్నో సమస్యలను ఎదర్కొంటున్నారు. దేశం కాని దేశంలో ఏ దిక్కూ లేకుండా వారి బాధలను తమ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మగ్గిపోతున్నారు. ఇదే నేపధ‌్యంలో పలువురు మహిళలు తమ ఎన్నారై భర్తలపై విదేశాంగ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు.

గడిచిన ఐదేళ్లలో 6 వేల మంది మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేసినట్టు సర్వేలో తేలింది. అయితే ఈ విషయాలపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్ సభలో తెలిపారు. ఈ విషయం గురించి ఓ ఎంపీ అడిగిన ప్రశ్నలకు బదులుగా 2015లో 796 మంది, 2016లో 1510 మంది, 2017లో 1498 మంది, 2018లో 1299 మంది, ఈ ఏడాది 991 మంది తమ భర్తలపై ఫిర్యాదు చేశారని ఆయన స్ఫష్టం చేశారు.



 

Tags:    

Similar News