Uttar Pradesh: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి
Uttar Pradesh: శిథిలాల కింద చిక్కుకున్న 19 మంది కార్మికులు
Uttar Pradesh: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. పై కప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం 19 మంది కార్మికులను రక్షించారు. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.