మానవ సాధికారితపై అభిజిత్‌కు ఎంతో తపన ఉంది : మోదీ

నోబెల్ విజేత, ప్రముఖ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీ ఢిల్లీలో భారత్ ప్రధాని మోదీతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.

Update: 2019-10-22 10:20 GMT

నోబెల్ విజేత, ప్రముఖ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీ ఢిల్లీలో భారత్ ప్రధాని మోదీతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీతో భేటీ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మానవ సాధికారితపై అభిజిత్ ఎంత తపన ఉందో అతని మాటల్లో అర్ధమవుతోందని పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై తాము సంభాషించామని మోదీ తెలిపారు. అభిజిత్ సాధించిన విజయాలతో భారత్ గర్వపడుతోందని మోదీ తన ట్వీటర్ లో పేర్కొన్నారు.

అయితే ఇటీవలె అభిజిత్ బెనర్జీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొబోతుందని, వాటిన నియంత్రనకు ప్రభుత్వం చోరవ చూపడం లేదని విమర్శించారు. అయితే అభిజిత్ బెనర్జి వ్యాఖ్యలు కేంద్ర మంత్రి గోయల్ తిప్పికొట్టారు. అభిజిత్ కమ్యూనిజం భావజాలంతో ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యం మోదీతో అభిజిత్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 



Tags:    

Similar News