Yash’s Toxic: యష్ ‘టాక్సిక్’.. పాత్రల పేర్లే స్టోరీ క్లూ ఇచ్చాయా?

కన్నడ స్టార్ హీరో యష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్..

Update: 2025-12-31 11:22 GMT

Yash’s Toxic: యష్ ‘టాక్సిక్’.. పాత్రల పేర్లే స్టోరీ క్లూ ఇచ్చాయా?

కన్నడ స్టార్ హీరో యష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో యష్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడనే టాక్ ఆసక్తిని మరింత పెంచుతోంది.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన వీరి ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అంతేకాదు.. ఈ హీరోయిన్ల పాత్రల పేర్లు కూడా నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి.

కియారా అద్వానీ – నదియా

నయనతార – గంగా

హ్యుమా ఖురేషి – ఎలిజబెత్

ఈ మూడు పేర్లు మూడు భిన్నమైన కమ్యూనిటీలను సూచిస్తున్నాయనే అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. పాత్రల పేర్లనే ఇంత ఆలోచించి ఎంపిక చేశారంటే, కథలో కీలక మలుపులు ఉంటాయన్న సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గత చిత్రాలను పరిశీలిస్తే, ఆమె కథల్లో పాత్రలకు ఉన్న లోతు, సామాజిక అంశాల ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా చూపించడంలో ఆమెకు ప్రత్యేక శైలి ఉంది. అదే తరహాలో టాక్సిక్లో కూడా హీరోతో పాటు హీరోయిన్ల పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

కియారా పోషిస్తున్న నదియా పాత్ర కథలో ఎమోషనల్ డెప్త్‌ను పెంచేలా ఉంటుందని సమాచారం. ఇక నయనతార నటిస్తున్న గంగా పాత్ర సంప్రదాయం, శక్తి, భావోద్వేగాల సమ్మేళనంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు హ్యుమా ఖురేషి పోషిస్తున్న ఎలిజబెత్ పాత్ర అంతర్జాతీయ నేపథ్యం లేదా విదేశీ కమ్యూనిటీకి చెందినదిగా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ మూడు పాత్రలు మూడు వేర్వేరు ఆలోచనా ధోరణులు, జీవన విధానాలను సూచిస్తూ కథను కొత్త దిశగా నడిపిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి టాక్సిక్ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను ముందుకు నడిపించే కీలకమైన బలంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. యష్ పాత్రతో ఈ మూడు క్యారెక్టర్లు ఎలా ముడిపడతాయన్నదే ఇప్పుడు ప్రేక్షకుల ముందున్న అసలైన ఆసక్తికర ప్రశ్న.

Tags:    

Similar News