మహేష్ బాబు తో ఇబ్బందిగా ప్రవర్తించిన అల్లు అర్జున్
*మహేష్ బాబు కి అల్లు అర్జున్ కి మధ్య అసలు ఏం జరిగింది
మహేష్ బాబు తో ఇబ్బందిగా ప్రవర్తించిన అల్లు అర్జున్
Tollywood: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఇప్పటిదాకా ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ తాజాగా ఈ ఇద్దరు స్టార్ లు ఒకే వేదికను పంచుకోవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణ రిసెప్షన్ వేడుకకు మహేష్ బాబు తో పాటు అల్లు అర్జున్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే, ముందుగా మహేష్ బాబు నవ వధూ వరులకు శుభాకాంక్షలు చెప్పడానికి వేదికపైకి వచ్చారు.
అది గమనించకుండా అల్లు అర్జున్ కూడా స్టేజ్ ఎక్కగానే, అక్కడ టీమ్ అంతా హడావుడి చేశారు. మహేష్ బాబు ని చూసి అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ అయితే ఇచ్చారు కానీ ఆ తర్వాత మాత్రం అలానే ముఖం తిప్పుకున్నారు. మామూలుగా అయితే ఇలా ఇద్దరు స్టార్ హీరోలు చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఒకరినొకరు పలకరించుకుని కొంత సమయం గడుపుతూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా మిగతా హీరోలతో ఇలాగే చేస్తారు కానీ కేవలం మహేష్ బాబుతోనే ఇలా ఇబ్బందిగా ఉన్నట్టు ప్రవర్తించడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే బన్నీ ఇలా ఎందుకు చేశారు అనే దానికి కారణం ఇంకా తెలియరాలేదు. అయితే 2021 సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" మరియు అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో" సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. ఆ సమయంలో ఇరు వర్గాల అభిమానుల మధ్య బాగానే గొడవలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ సంఘటన తర్వాత అవి మళ్ళీ మొదలైనా ఆశ్చర్యం లేదు.