Waltair Veerayya: థియేటర్లలో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్న మెగా అభిమానులు
Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య
Waltair Veerayya: థియేటర్లలో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్న మెగా అభిమానులు
Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరు. దీంతో అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బెనిఫిట్ షోలకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఉదయం 4 గంటలకే హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో స్పెషల్ షో వీక్షించారు. దర్శకుడు బాబీతో పాటు, దేవీశ్రీ ప్రసాద్, చిరంజీవి కుమార్తెలు వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించారు.