Vithika Sheru: నా భార్త ఫెయిల్యూర్ కాదు.. వితిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vithika: సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ భార్య వితిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ సందేశ్ చాలా రోజుల నుంచి సరైన విజయాన్ని అందుకోలేకపోవడంపై ఆమె స్పందించారు.
Vithika: నా భార్త ఫెయిల్యూర్ కాదు.. వితిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vithika: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యాడు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే తన నటనతో యూత్‌ను అట్రాక్ట్ చేశాడు వరుణ్. ఇక ఆ తర్వాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయం అందుకోలేకపోయారు.
ఇదిలా ఉంటే వరుణ్ తాజాగా 'నింద' అనే సినిమాలో నటిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్ జగన్నాథం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ భార్య వితిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ సందేశ్ చాలా రోజుల నుంచి సరైన విజయాన్ని అందుకోలేకపోవడంపై ఆమె స్పందించారు.
ఈ సందర్భంగా వితిక మాట్లాడుతూ.. వరుణ్ సినిమా ఫంక్షన్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. నింద ప్రమోషన్స్‌లో వరుణ్‌ని చాలామంది తన కెరీర్ ఫెయిల్యూర్‌పై ప్రశ్నలు అడుగుతున్నారన్న వితిక..అవకాశాలు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్ యాక్టర్ కదా’ అని ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే వరుణ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారని చెప్పుకొచ్చారు.
సినిమాలు వద్దని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్ యాక్టర్‌లుగా చెబుతుంటారు. కానీ వరుణ్ మాత్రం అలా చేయలేదు,ఇండస్ట్రీనే నమ్ముకుని, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ సినిమాకు 100 శాతం న్యాయం చేస్తున్నాడు. ప్రస్తుతం నటించిన నింద మంచి విజయం సాధిస్తుందని వితిక ధీమా వ్యక్తం చేశారు.
ఇక వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నింద చిత్రం తనకెంతో ప్రత్యేకమని తెలిపారు. ఇప్పటి వరకు 20కిపైగా సినిమాల్లో నటించానని తెలిపిన వరుణ్, వాటన్నిటికంటే ఇది స్పెషల్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపిన వరుణ్, నింద కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.