అనుష్క పోస్ట్ కి విరాట్ అదిరిపోయే రిప్లయ్.. నెటిజన్లు ఫిదా!
Virat Kohli Adorable Comment : బాలీవుడ్ భామ అనుష్క శర్మ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే.. గత నెల అనుష్క,
Virat Kohli's Adorable Comment On Anushka Sharma's baby bump pic
Virat Kohli Adorable Comment : బాలీవుడ్ భామ అనుష్క శర్మ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే.. గత నెల అనుష్క, విరాట్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా వెల్లడించారు. దీనితో అభిమానులతో పాటుగా సినీ సెలబ్రిటీలు వారిని విష్ చేశారు. అయితే తాజాగా అనుష్క మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?'
అయితే దీనికి కోహ్లి అందమైన సమాధానం ఇచ్చాడు.. 'నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది' అంటూ హార్ట్ సింబల్ ని జతపరిచాడు విరాట్.. ఈ ట్వీట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించుకొని 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు.. ప్రస్తుతం అనుష్క పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.అటు కోహ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ కోసం దుబాయ్ లో ఉన్నాడు.. కోహ్లి ఆర్‌సిబికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. సెప్టెంబరు 19 న ఐపిఎల్ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 21 న దుబాయ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది ఆర్‌సిబి