"ఆర్ఆర్ఆర్" గురించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: "ఆర్ ఆర్ ఆర్" గురించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Update: 2023-03-22 16:00 GMT

"ఆర్ఆర్ఆర్" గురించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా "ఆర్ఆర్ఆర్". తెలుగులో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆస్కార్ అవార్డును కూడా అందుకొని ప్రపంచమంతా టాలీవుడ్ పేరు మారుమ్రోగేలా చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ పాత్ర మాత్రమే హైలైట్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు మరియు ఎన్టీఆర్ పాత్రను మాత్రమే గొప్పగా చూపించారని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో గొడవలు కూడా పడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకి స్క్రిప్ట్ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నిజానికి మొదట అల్లూరి సీతారామరాజు పాత్ర మీద మాత్రమే కథను రాశారట ఆ తరువాతే కొమరం భీమ్ పాత్ర సినిమాలోకి యాడ్ అయిందని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇక ఇద్దరు హీరోలు అంటే ఇది వరకు కలిసి పని చేసిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు తన పైన నమ్మకం ఉందని రాజమౌళి ఈ ఇద్దరు హీరోలని ఎంపిక చేసుకున్నారట.

"మొదట ఒక హీరో బ్రిటిష్ వారి దగ్గర పని చేస్తూ స్వాతంత్రం సాధించాలని దానికి కావాల్సిన ఆయుధాలను సేకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే బ్రిటిష్ వారు ఒక ఖైదీ ను చంపేయమని చెబుతారు. కానీ తనకన్నా గొప్ప వీరుడు అవుతాడు ఆ ఖైదీ తన గొప్ప వీరుడు అవుతాడు అని నమ్మిన హీరో బ్రిటిష్ వారికి అబద్ధం చెప్పి చంపడానికి తీసుకువెళ్లినట్టు తీసుకువెళ్లి అతనిని వదిలేస్తాడు. కానీ అది తెలియని ఆ ఖైదీ ఇతన్ని పొడిచేస్తాడు," అని సినిమా లైన్ చెప్పగా రాజమౌళికి అది బాగా నచ్చిందని దానిని స్క్రిప్ట్ గా డెవలప్ చేసామని అన్నారు విజయేంద్ర ప్రసాద్.

Tags:    

Similar News