Vijay Deverakonda: లవ్ బ్రేకప్ అయి బాధలో ఉన్నా..!!

Update: 2021-11-08 06:42 GMT

Vijay Deverakonda: లవ్ బ్రేకప్ అయి బాధలో ఉన్నా..!!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి అర్జున్ రెడ్డితో మాస్ ఫాలోయింగ్, గీత గోవిందం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో ఆకట్టుకున్నాడు. తన అందంతో పాటు నటనతోను ఎంతో మంది అమ్మాయిల మనసు దోచిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి ఇటీవల బ్రేకప్ అయినట్టు తెలిపాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన "పుష్పక విమానం" సినిమా ప్రమోషన్ లో భాగంగా చిట్ చాట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

మనసు చాలా బాధగా ఉందని, ఈ మధ్య కాలంలోనే తన లవ్ బ్రేకప్ అయిందని ఆ బాధ నుండి బయపడటానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అయితే అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండతో బ్రేకప్ చేసుకున్న అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ లేక వేరే ఇంకెవరైనా అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

సరదాగా సాగిన ఈ చిట్ చాట్ లో మాట్లాడిన విజయ్ దేవరకొండ తన మొదటి జీతం 500 రూపాయలని చెప్పుకొచ్చాడు. ఇక పుష్పకవిమానం కథ నచ్చే సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్నానని విజయ్ దేవరకొండ తెలిపాడు. దామోదర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన సాన్వి మేఘన, శిల్పిక నటించగా సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

Tags:    

Similar News