Vijay Deverakonda: "జనగణమన" గురించి వదిలేయండి అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: "లైగర్" రిజల్ట్ మర్చిపోండి అంటున్న విజయ్ దేవరకొండ

Update: 2022-09-13 07:00 GMT

Vijay Deverakonda: "జనగణమన" గురించి వదిలేయండి అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మరోవైపు సినిమా రిలీజ్ కు ముందే పూరీ తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ "జన గణ మన" ని విజయ్ తో అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. కానీ ఈ మధ్యనే విడుదలైన "లైగర్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో "జనగణమన" వంటి భారీ బడ్జెట్ సినిమా చేయలేమని నిర్మాతలు వెనకడుగు వేసేశారు. తాజాగా సైమా అవార్డుల వేడుక కు హాజరయ్యారు విజయ్ దేవరకొండ.

ఈ నేపథ్యంలో "జనగణమన" గురించి అడగగా, విజయ్ చాలా తెలివిగా తప్పించుకున్నారు. "ఇది సైమా ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. మిగతా అన్నిటి గురించి మర్చిపోయి ఈ రాత్రి ఎంజాయ్ చేయండి" అని మాట దాటేసారు విజయ్ దేవరకొండ. తన ఫ్లాప్ సినిమాల గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడే విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం ఇలా మొహం చాటేయడం అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది.

Tags:    

Similar News