Vijay Deverakonda, Rashmika: మరోసారి కెమెరా కంటికి చిక్కిన విజయ్,రష్మిక.. హోటల్‌లో..
Vijay Deverakonda, Rashmika Mandanna: టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Vijay Deverakonda Rashmika: మరోసారి కెమెరా కంటికి చిక్కిన విజయ్,రష్మిక.. హోటల్‌లో..
Vijay Deverakonda Rashmika: టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కపుల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిజ జీవితంలో కూడా ఈ జంట ఒక్కటవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ జంట ఎప్పుడూ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇప్పటికే చాలాసార్లు ఈ జంట కలిసి కనిపించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మొన్నటికి మొన్న విజయ్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రష్మిక హాజరైనట్లున్న ఫొటోలు బయటకు వచ్చాయి.
అలాగే గతంలో విదేశాల్లో ఈ జంట కలిసి ఉన్న ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఓ హోటల్‌లో రష్మిక, విజయ్ భోజనం చేస్తున్న సందర్భంలో ఎవరో ఫొటో తీశారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జంట నిజంగానే డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.
అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ మధ్య ఉన్న బంధం గురించి ఒక్కసారి కూడా ఓపెన్ అవ్వలేదు. ఇంతకీ విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారా.? వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారా.? లాంటి వివరాలు తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందించే వరకు చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం పుష్ప2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. కాగా విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.