Venu Thottempudi: నటుడు వేణు ఇంట విషాదం

Venu Thottempudi: ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2024-01-29 06:21 GMT

Venu Thottempudi: నటుడు వేణు ఇంట విషాదం

Venu Thottempudi: ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వేణు తండ్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు. దాంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు కన్నుమూయడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

వేణు హీరోగా కెరీర్ ప్రారంభించి మంచి విజయాలను అందుకున్నారు. చాలా సినిమాల్లో హీరోగా నటించిన వేణు ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆతర్వాత దమ్ము , రవితేజ రావణాసుర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు వేణు. ఇటీవలే అతిథి అనే వెబ్ సిరీస్ లో నటించారు వేణు . ఈ వెబ్ సిరీస్ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    

Similar News