'Naarappa' First Look.. తెలుగు వెంకటేష్ ఇరగదీశాడప్ప
వైవిద్యభరిత సినిమాలకు చేయడంతో ఎప్పుడూ ముందుంటారు టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్.
వైవిద్యభరిత సినిమాలకు చేయడంతో ఎప్పుడూ ముందుంటారు టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఇటీవలే మేనల్లుడు నాగచైతన్యతో కలిసి చేసిన వెంకీమామ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేష్ మరో సినిమాతో ముందుకు రానున్నారు. వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఆ సినిమాకు పెట్టిన తెలుగు టైటిల్ పై అందరి దృష్టి పడింది. అంతేకాదు వెంకటేష్ తాజా లుక్ ఓ రేంజ్లో ఉంది.
ప్రస్తుతం వెంకటేష్ తమిళంలో భారీ విజయం అందుకున్న సినిమా 'అసురన్ ' దీనికి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సురేష్ బాబు నిర్మాణతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ' నారప్ప' అనే టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. జనవరి చివరల్లో సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. అనంతపురంలో మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం ఈ సినిమాలో తన పాత్రపై బాడీ లాంగ్వేజ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. తమిళంలో థనుష్, మంజు వారియర్ హీరోహీరోయిన్లగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఫస్ట్ లూక్ పై సమంత, రానా, అనిల్ రావిపూడి ట్విటర్ వేదికగా స్పందించారు. వెంకటేష్ ఫస్ట్ లుక్ బాగుందని పలువురు ప్రశంసించారు. గత సంవత్సరం వచ్చిన వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 , వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీమామ సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
#Naarappa Shoot Begins Today! pic.twitter.com/SexcogRnaS
— Venkatesh Daggubati (@VenkyMama) January 22, 2020