అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా నవంబర్ 29న విడుదల చేయాలనుకున్నాం..కొన్ని కారణాలు వలన రెండువారాల ఆలస్యం అయ్యిందన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు లీగల్ గా వెళ్లనున్నట్లు చెప్పారు. సినిమా రిలీజ్ అయితే గొడవలు జరుగుతాయని ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదన్నారు. చిత్రంలో ఒక సబ్జెక్టును సీరియస్ గా కాకుండా సెటైర్ గా చెప్పానని.. ఇందుకు సినిమా ఆపి వేయాలని గగ్గోలు పెట్టారన్నారు. డెఫినెట్ గా ఇలాంటి సెటైరికల్ మూవీస్ చేస్తానన్నారు రామ్ గోపాల్ వర్మ.