Mahesh Babu: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ గురించి అప్డేట్

Mahesh Babu: అప్పటి నుంచి మరొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు

Update: 2023-04-23 05:37 GMT

Mahesh Babu: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ గురించి అప్డేట్

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "అతడు" మరియు "ఖలేజా" వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కింది. సినిమాకి సంబంధించిన మరొక షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల అంటే మే మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన మరొక షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందట. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ సినిమాని కూడా త్వరగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. "సార్" మరియు "విరూపాక్ష" బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక విభిన్న లుక్కుతో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే నెలాఖరులో ఈ సినిమా అధికారిక టైటిల్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

Tags:    

Similar News