కరోనాని కాదని సినిమాల కోసం అభిమానులు థియేటర్స్ కి వస్తారా...?

Update: 2020-08-27 11:22 GMT

Unlock 4: cinema halls likely to be reopened: అన్ లాక్ 4.0 ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఈ సారి సినిమా ధియేటర్లకు అవకాశం ఉండోచ్చంటున్నారు. ఇప్పటికే షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చింది. ఒక వేళ సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం వస్తే, ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించే సత్తా హీరోలకు ఉందా?

సెప్టెంబర్ 1 నుండి టాలీవుడ్ కి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది. ఒక వైపు సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు మరో వైపు థియేటర్లో సినిమాలను రిలీజ్ చేసుకోనే అవకాశం ఉండోచ్చు. ఒక వేళ అదే జరిగితే, స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారా? రిలీజ్ చేస్తే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలుగుతారా? పవన్ కళ్యాణ్ సినిమా, రాంచరణ్, ఎన్టీఆర్ సినిమాలు చాలా వరకు షూటింగ్స్ జరుపుకున్నాయి..

వకిల్ సాబ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు రిలీజ్ లకు దగ్గరగానే ఉన్నాయి. అయితే ఫాస్ట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన రిలీజ్ చేసుకునే సత్తా వీళ్లకు ఉందా? రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వస్తారా? కరోన కంటే స్టార్స్ పై అభిమానం ఎక్కువ ఏం కాదు. మరి తమ చరిస్మాతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఎవరికి ఉంది? మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ లు తమ సినిమాలకు ఇంకా టైం ఉండటంతో కాస్త రిలీఫ్ అయ్యారు. కానీ పవన్ కల్యాన్, జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు మాత్రం టెన్షన్ తప్పేలా లేదు.

కరోనా భయంతో అత్యవసరమైతే తప్పించి ఇంటి నుంచి బయటికి రాని ప్రజలకి, హీరోలు తమతమ అభిమానుల్ని థియేటర్స్ కి రప్పించుకోగలరా లేదనేది వేచి చూడాలి..? అలాగే లాక్ డౌన్ మొదలైన దగ్గర్నించి ఓటీటీ ప్లాట్ ఫాం కి అలవాటు పడ్డ ప్రేక్షకుడు సినిమా హాళ్లకు వస్తాడా అనేదే పెద్ద ప్రశ్న.


Tags:    

Similar News