బాలకృష్ణపై పోసాని ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై రచయిత పోసాని కృష్ణ మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Samba Siva Rao
Updated on: 7 Jun 2020 10:09 PM IST
బాలకృష్ణపై పోసాని ఆసక్తికర కామెంట్స్
X
Posani Krishna Murali (File Photo)

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై రచయిత పోసాని కృష్ణ మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినిపెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి బాలయ్యను పిలవకపోవడంతో.. మీడియా దీనిపై బాలకృష్ణను ప్రశ్నించింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. భూములు ఏవైనా పంచుకుంటున్నారా? అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఇండస్ట్రీలో ఉన్న విభేదాలను, వివాదాలను మరోసారి బహిర్గతం చేసాయి. అందులో కొందరు బాలయ్యకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా చిరంజీవితో పాటు బాలయ్యను కూడా పిలవాలని తేజ అన్నాడు. తాజాగా పోసాని కూడా బాలకృష్ణ వ్యాఖ్యలకు స్పందించారు. బాలకృష్ణకు కోపం నిమిషం కూడా ఉండదని అన్నారు.

బాలకృష్ణ మాటలను సీరియస్‌గా తీసుకొని ఎవరూ బాధపడవద్దని కోరారు. కృష్ణ జలాల వివాదంపై పోసాని మాట్లాడారు.. ఏపీ తెలంగాణ సీఎంలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నారు. జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని భావిస్తున్నా. చర్చలతోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని పోసాని అన్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story