ప్రియమణికి వెంకటేష్ పుట్టినరోజు కానుక!

Update: 2020-06-04 15:32 GMT

దగ్గుబాటి వెంకటేశ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న విరాట పర్వం 'నారప్ప' చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ సినిమాలో నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో మంచి విజయం సాధించిన 'అసురన్‌' చిత్రానికి రీమేక్‌గా 'నారప్ప' తెరకెక్కుతోంది.

గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న 'నారప్ప' సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో 'నారప్ప' చిత్రంతో పటు 'విరాటపర్వం' అనే చిత్రంలో కూడా నటిస్తుంది.

'హ్యాపీ బర్త్‌డే ప్రియమణి. ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలని, అలాగే ఈ ఏడాది అంతా నీకు మంచి విజయాలు వరించాలని కోరుకుంటున్నాను' అని ఆయన పేర్కొన్నారు.




Tags:    

Similar News