ఈ దేశంలో ఏంటీ ఖర్మ.. హాథ్రస్‌ ఘటనపై పూరీ!

Puri Jagannadh On Hathras Incident : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. బాధితురాలుకి న్యాయం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Update: 2020-10-05 05:11 GMT

Puri Jagannadh

Puri Jagannadh On Hathras Incident : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. బాధితురాలుకి న్యాయం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. యోగి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటన పైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్పందించారు. దేశంలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతోందని.. అలా రోజుకు దేశంలో 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని పూరి అన్నారు. ఇంకా పూరి ఏమ్మన్నారంటే?

ఒకసారి అందరం నిజాలు మాట్లాడుకుందాం.. దేశంలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతోంది. అలా దేశంలో రోజుకు వంద అత్యాచారాల కేసులు నమోదు అవుతున్నాయి. రోజూ మహిళలపై నాలుగు లక్షలపైగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా హాథ్రస్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలకి అన్యాయం జరిగితే న్యాయం పక్కన పెడితే న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.. ఏంటీ ఈ ఖర్మ.. ఈ దేశంలో ఆడవాళ్లు ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. సుశాంత్‌ ఒక్కడే కాదు. అదే సమయంలో భారత్‌లో 300 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వాళ్ల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. గాల్వాన్‌ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదు.

ఇక నేపోటిజం ఫెస్టివల్‌.... సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఒక స్టార్‌. ఇండస్ట్రీలో కొత్త హీరో సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఆ సమయంలో ఒక్క థియేటరైనా నిండిందా? పోనీ కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని మీరు ఎప్పుడైనా టిక్కెట్‌ కొన్నారా? చివరికి మీరందరూ స్టార్స్‌ సినిమాలే చూస్తారు. తెలంగాణలో దిశాకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికి జరగాలి. ఆడవాళ్ల కోసం నిలబడండి. పోరాటం చేయండి. అని పూరి పేర్కొన్నారు.


Full View

Tags:    

Similar News