Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హెయిర్ సీక్రెట్.. విగ్ కాదు.. మరి ఏమిటి?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Update: 2025-08-09 07:30 GMT

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో హ్యాండ్సమ్‌గా, ఫిట్‌గా కనిపిస్తారు. అయితే, ఆయన ప్రతి సినిమాకు హెయిర్ స్టైల్ మార్చుకోవడం, వయసు పెరిగినా జుట్టు ఏమాత్రం పలుచబడకపోవడంపై చాలాకాలంగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. మహేష్ బాబు తలపై ఉన్నది నిజమైన జుట్టేనా? లేక ఏదైనా టెక్నాలజీని వాడుతున్నారా? అనే ప్రశ్న చాలామందిలో ఉంది. ఈ విషయంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణకు, అలాగే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబుకు హెయిర్ లాస్ సమస్య ఉండేది. వారందరికీ వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోవడం మనం చూశాం. అలాంటి జెనెటిక్ సమస్య ఉన్నప్పటికీ, మహేష్ బాబుకు మాత్రం ఏమాత్రం జుట్టు ఊడిపోకుండా, పర్ఫెక్ట్ హెయిర్‌తో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఆయన హెయిర్ వెనుక ఏదో సీక్రెట్ దాగి ఉందని అందరూ నమ్ముతున్నారు.

అనేక ఊహాగానాలు, వార్తల ప్రకారం.. మహేష్ బాబు విగ్ వాడరని, కానీ దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన క్యూ6 టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ టెక్నాలజీలో నిజమైన జుట్టులా కనిపించే ప్యాచ్‌లను తల మీద ఫిక్స్ చేస్తారు. ఇవి అచ్చం ఒరిజినల్ జుట్టులాగే కనిపిస్తాయి. అందుకే మహేష్ బాబు తరచూ విదేశాలకు వెళ్లి ఈ ప్యాచ్‌లను సెట్ చేసుకుంటారని సమాచారం. ఈ టెక్నాలజీ వల్ల ఆయన ఏ సినిమాకు కావాలంటే ఆ సినిమాకు కొత్త హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతున్నారని అంటున్నారు.

మహేష్ బాబు జీవితంలో రెండు పెద్ద విషాదాలు జరిగాయి. 2022లో ఆయన తల్లి, తండ్రి ఇద్దరూ మరణించారు. అయితే, ఆ సమయంలో మహేష్ బాబు తల బోడి చేయించుకోలేదు. సాధారణంగా దక్షిణ భారత సంస్కృతిలో కుటుంబ పెద్దలు చనిపోయినప్పుడు తల బోడి చేయించుకోవడం ఆనవాయితీ. కానీ, మహేష్ అలా చేయకపోవడంతో ఆ సమయంలో ఈ విషయంపై మరింత చర్చ జరిగింది. ఆయన తలపై ఉన్న హెయిర్ ప్యాచ్‌లను తొలగించడం సులభం కాదు కాబట్టే ఆయన అలా చేయలేదని చాలామంది వాదించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం పొడవైన జుట్టుతో ఆయన కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ లుక్ కూడా ఈ టెక్నాలజీ ద్వారానే సాధ్యమైందని అంటున్నారు. మొత్తానికి, మహేష్ అందం వెనుక ఉన్న ఈ సీక్రెట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News