OTT Movie: మహిళలపై అఘాయిత్యాలు చేసి అమ్మేస్తున్న గ్యాంగ్… ఐఎండీబీలో 8.0 రేటింగ్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఎంతగానో కట్టిపడేస్తాయి. అలాంటి ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా “The Diplomat” ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ, ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. హిందీ భాషలో విడుదలైన ఈ మూవీకి IMDbలో 8.0 రేటింగ్ వచ్చిందంటేనే ఎంతగా ఆడియెన్స్ హార్ట్‌చేసిందో అర్థం అవుతుంది.

▪️ ఏమై ఉంటుంది కథ?
ఈ మూవీ కథ భారత్ – పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో నడుస్తుంది. ఒక భారతీయ యువతి పాకిస్తాన్‌లో అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన సమయంలో, ఆమెను కాపాడే భారత రాయబారి పోరాటం నేపథ్యంలో ఇది సాగే పొలిటికల్ థ్రిల్లర్.
▪️ నటీనటులు & టెక్నికల్ టీం
దర్శకత్వం: శివం నాయర్
ముఖ్య పాత్రలు:
జాన్ అబ్రహాం – జె.పి. సింగ్ (భారత రాయబారి)
సాదియా ఖతీబ్ – ఉజ్మా అహ్మద్ (బాధిత యువతి)
కుముద్ మిశ్రా, షరీబ్ హష్మీ, రేవతి, జగ్జీత్ సంధు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
▪️ అసలు విషయం ఏంటి?
ఉజ్మా అనే యువతి మలేషియాలో తాహిర్ అనే వ్యక్తిని ప్రేమించి, అతడి ఆహ్వానంతో పాకిస్తాన్‌కు వెళ్లుతుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అసలు నరకయాతన మొదలవుతుంది. తాహిర్ ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని, ఒక మారుమూల గ్రామంలో బంధిస్తాడు. శారీరకంగా, మానసికంగా హింసిస్తాడు. ఎట్టకేలకు, భారత రాయబారి జె.పి. సింగ్ సహాయంతో భారత హై కమిషన్‌ను ఆశ్రయిస్తుంది.
అక్కడి నుంచి ఆమెను సురక్షితంగా తీసుకురావడమే కాకుండా, పాక్ అధికారులతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆమెకు న్యాయం చేయాలనే లక్ష్యంతో జె.పి. సింగ్ పాకిస్తాన్‌లోని రాజకీయ ఒత్తిడులను తట్టుకుంటూ ముందుకు సాగుతాడు. అతనికి సహాయంగా ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ (చిత్రంలో రేవతి పోషిస్తుంది) కూడా కీలక పాత్ర పోషిస్తారు.