Producer: మూడు కోట్లు అనుకుంటే 40 కోట్లు అయిన యశోద సినిమా

Sivalenka Krishna Prasad: సినిమా కథకి గ్లోబల్ అప్పీల్ ఉందని నేను నమ్మాను సినిమా మాగ్నిట్యూడ్ పెంచాల్సి వచ్చింది

Update: 2022-11-08 08:39 GMT

మూడు కోట్లు అనుకుంటే 40 కోట్లు అయిన యశోద సినిమా

SivaLenka Krishna Prasad: స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్ తో యువతను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సమంత "యశోద" అనే ఒక యాక్షన్ త్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సరగసి కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమా ఈనెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర నిర్మాత సినిమా బడ్జెట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ముందుగా ఈ సినిమాకి కేవలం మూడు కోట్ల బడ్జెట్ను మాత్రమే అనుకున్నట్లుగా తెలిపారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. "నిజానికి యశోద సినిమా ఒక మూడు కోట్ల బడ్జెట్ ప్రాజెక్టుగా మొదలైంది కానీ పూర్తయ్యేసరికి 40 కోట్లు ఖర్చయింది.

సినిమా కథకి గ్లోబల్ అప్పీల్ ఉందని నేను నమ్మాను. అందుకే ఎక్కువమంది ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి సినిమా మాగ్నిట్యూడ్ పెంచాల్సి వచ్చింది," అని అన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో సమంత ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News