Movie News: నా కెరీర్‌లో పెద్ద తప్పు ఆ సినిమాకు పని చేయడమే.. దెబ్బకు దేశం వీడి పోయా..!

Adipurush: ప్రభాస్‌ కెరీర్‌లోనే ఆదిపురుష్‌ అతిపెద్ద డిజాస్టర్‌‌గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శలు ఓ రేంజ్‌లో వచ్చాయి.

Update: 2023-11-10 07:07 GMT

Movie News: నా కెరీర్‌లో పెద్ద తప్పు ఆ సినిమాకు పని చేయడమే.. దెబ్బకు దేశం వీడి పోయా..!

Adipurush: ప్రభాస్‌ కెరీర్‌లోనే ఆదిపురుష్‌ అతిపెద్ద డిజాస్టర్‌‌గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శలు ఓ రేంజ్‌లో వచ్చాయి. అలాగే ఈ సినిమాపై భారీగానే ట్రోలింగ్‌ జరిగాయి. నటీనటుల గెటప్స్‌, డైలాగ్ ఇలా అన్నీటిపైనా విమర్శలు చోటుచేసుకున్నాయి. అలాగే ఈ సినిమాకు మనోజ్‌ ముంతషీర్‌ మాటల రచయితగా పని చేశాడు. అయితే, ఈయనపైనా భారీగానే ట్రోలింగ్ ‌ జరిగింది. ఆయన రాసిన ఓ డైలాగే అందుకు కారణం. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆ డైలాగును మార్చి అభిమానులకు సారీ చెప్పాల్సి వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఆదిపురుష్‌ సినిమా వల్ల ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా తెలిపాడు. 'ఈ ప్రపంచం మనల్ని ఓరోజు మంచివాడిగా చూస్తే.. మరోక రోజు చెడ్డవాడిగా చూస్తుంది. అయితే, మన కుటుంబానికి మాత్రంఎప్పటికీ మనం హీరోగానే కనిపిస్తాం. అయితే, నేనో తప్పు చేశాను. అది ఆదిపురుష్‌ మూవీకి రచయితగా పనిచేయడమే. కానీ ఆ తప్పు నుంచి చాలానే నేర్చుకున్నాను. ఇకపై ఎంతో జాగ్రత్తగా పనిచేస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, ఆదిపురుష్ సినిమా విడుదలయ్యాక వచ్చిన విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అయితే, వాటిపై స్పందించకుండా ఉండాల్సింది. జనాలు నాపై ఎంతో కోపంగా ఉన్నారు. ఎంతో ‍ద్వేషించారు. చంపుతామని కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇఖ్కడ ఉంటే బాగోదని తెలుసుకున్నాను. వెంటనే విదేశాలకు వెళ్లిపోయాను. వివాదాలు తగ్గిపోయేంత వరకు అక్కడే ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం బయటడ్డాను. ప్రస్తుతం నాకు మరో ఛాన్స్‌ కావాలంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News