Pawan Kalyan: పవన్‌ కోసం తమన్‌ ఫోక్‌ సాంగ్‌?,,,ఎందుకో తెలుసా

Pawan Kalyan: పవన్‌ కోసం ఓ ఫోక్‌ సాంగ్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డాట తమన్‌

Update: 2021-06-26 01:16 GMT

Pawan Kalyan-Rana:(The Hans India)

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది 'వకీల్‌సాబ్'తో విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' రీమేక్‌లో నటిస్తున్నారు. యువ నటుడు రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సంభాషణలు అందిస్తుండటం విశేషం.

ఇటీవల కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో సినిమాను తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్ర బృందం యోచిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు చకచకా సాగిపోతున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో పవన్‌ కోసం ఓ ఫోక్‌ సాంగ్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు తమన్‌. ద్వితీయార్ధంలో ఈ పాట వస్తుందని సమాచారం.

అంతేకాదు, ఫోక్‌ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న పెంచల్‌దాస్‌ ఈ పాటను ఆలపించనున్నారట. అయితే, దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మలయాళ చిత్రం 'అప్పయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'లో బిజూ మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానాలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News