Thaman: చాక్లెట్లో ఆవకాయ ఎందుకు అంటున్న థమన్

Thaman: చాక్లెట్లో ఆవకాయ ఎందుకు అంటున్న థమన్

Update: 2022-03-14 07:30 GMT

చాక్లెట్లో ఆవకాయ ఎందుకు అంటున్న థమన్

Thaman: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 11న విడుదలైంది కానీ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేక పోయింది. ఇక ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించిన ఎస్.ఎస్. థమన్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పారు. దర్శక నిర్మాతలతో కంటే సినిమాకి తమన్ ఇచ్చిన హైప్ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఒక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు థమన్.

సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేవంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు కానీ ఇలాంటి అద్భుతమైన ప్రేమ కథలో యాక్షన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? చాక్లెట్ తింటూ దాంట్లోకి ఆవకాయ్ కావాలంటే ఎలా?" అని క్రిటిక్స్ ను ప్రశ్నించాడు థమన్. ఇక సినిమా కథ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నప్పటికీ థమన్ అందించిన సంగీతానికి మాత్రం మంచి మార్కులే వచ్చాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి ,భాగ్యశ్రీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Tags:    

Similar News