ఆ లెజెండరీ డైరెక్టర్ ఇకలేరు..

Update: 2019-04-02 04:14 GMT

లెజెండరీ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్‌(79) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని ఆయన తనయుడు జాన్‌ మహేంద్రన్‌ వెల్లడించారు. మహేంద్రన్‌ తమిళంలో అనేక సూపర్ డూపర్ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శంకర్‌, మణిరత్నం వంటి అగ్రదర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముల్లుమ్ మ‌ల‌రుమ్‌, జానీ, నెంజ‌తై కిల్లాడే చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవలే విజ‌య్ సేతుప‌తి సీతాకాతి, ర‌జ‌నీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాల‌లో నటుడిగాను క‌నిపించారు. 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్‌ రెండు సార్లు జాతీయ అవర్డును, 2018లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఆయన మృతితో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ విషాదంలో మునిగిపోయింది.

Similar News