Tamannaah Holi: బ్రేకప్ రూమర్స్..అంతలోనే తమన్నా, విజయ్ హెలీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

Update: 2025-03-15 05:30 GMT

 Tamannaah Holi: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, విజయ్ వర్మకి బ్రేక్ అయినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట హోలీ వేడుకల్లో సందడి చేసింది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబురాల్లో తమన్నా, విజయ్ వర్మలు పాల్గొన్నారు. అయితే వీరు ప్రేమలో ఉన్నప్పుడు ఏ ఈవెంట్ కు అయినా కలిసి వెళ్లేవారు. తాజాగా హోలీ వేడుకల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. వీరిద్దరూ విడివిడిగా రవీనా టాండన్ ఇంటికి వచ్చారు. ఫొటో గ్రాఫర్లను పలకరించి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రేకప్ వార్తల వేళ వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




2023లో లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో ఈ ఇద్దరు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నారు. అప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. స్వయంగా వాళ్లే తమ రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేశారు. కొంత కాలానికి డేటింగ్ ప్రారంభించారు. పబ్లిక్, రెడ్ కార్పెట్ ప్రదర్శనలు, డేట్ నైట్ ఔటింగ్స్ లో కనిపించారు. ప్రొఫెషనల్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కాదు ఫ్యాన్స్ కి ఫేవరేట్ కపుల్ గా కూడా మారిపోయారు. కానీ ఇటీవల పెళ్లి, కెరీర్ విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకే తమ రిలేషన్ షిప్ కు ముగింపు పలికారని బీటౌన్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News