Surya Sethupathi: విజయ్ సేతుపతి కుమారుడి డెబ్యూట్ మూవీకి ప్రశంసలు మాత్రమే.. కలెక్షన్లు భారీ నిరాశ!
తమిళ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అయిన చిత్రం "ఫీనిక్స్". జూలై 4, 2025న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మంచి అంచనాలే ఉన్నాయి.
Surya Sethupathi: విజయ్ సేతుపతి కుమారుడి డెబ్యూట్ మూవీకి ప్రశంసలు మాత్రమే.. కలెక్షన్లు భారీ నిరాశ!
Surya Sethupathi: తమిళ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అయిన చిత్రం "ఫీనిక్స్". జూలై 4, 2025న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మంచి అంచనాలే ఉన్నాయి. చిన్ననాటి నుంచే నానుమ్ రౌడీ తాన్, సింధుపథ్ వంటి చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన సూర్య.. ఇప్పుడొక పూర్తి స్థాయి హీరోగా తెరపై కనిపించాడు.
ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించగా, దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం అందించిన సామ్ సిఎస్ సూర్య యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని బాగా కష్టపడ్డాడు. విజయ్ సేతుపతి తన కుమారుడిని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చినా.. ఫీనిక్స్‌కు ఆశించిన స్థాయిలో హైప్ దక్కలేదు.
ప్రమోషన్ కార్యక్రమాల్లో సూర్య ప్రవర్తన కొంతమందికి నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురైంది. అయితే సినిమాలో సూర్య చేసిన యాక్షన్ కోసం కొంతమంది అభిమానులు ప్రశంసలు కురిపించారు.
అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటించిన "పరాంతు బో" (42 లక్షలు), సిద్ధార్థ్ – శరత్ కుమార్ నటించిన "3BHK" (రూ.1 కోటి పైగా) సినిమాల మధ్య భారీ పోటీ ఎదురై.. ఫీనిక్స్ తొలి రోజు కేవలం రూ.10 లక్షలే వసూలు చేయడం గమనార్హం. ఇది సినిమాకు షాక్‌లాంటి ఓపెనింగ్‌గా మారింది.
ఇప్పటికైనా వారాంతం కలెక్షన్లతో మళ్లీ ఫామ్ లోకి రావాలని టీమ్ ఆశిస్తోంది. అయితే ఫీనిక్స్‌కు బాక్సాఫీస్ దిశగా నిదర్శనమైన తొలి అడుగు మాత్రం నిరాశే.