Star Heroes Social Media Accounts: స్టార్స్ సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్లే హ్యాండిల్ చేస్తారా..?
Star Heroes Social Media Accounts: తెలుగు వారికి హీరోలంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. హీరోలను ఎంతో ఆరాధిస్తుంటారు. వారి అభిమాన సినిమా వచ్చిదంటే చాలు పండగే.. అలాంటి హీరోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు.
Star Heroes Social Media Accounts: స్టార్స్ సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్లే హ్యాండిల్ చేస్తారా..?
Star Heroes Social Media Accounts: తెలుగు వారికి హీరోలంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. హీరోలను ఎంతో ఆరాధిస్తుంటారు. వారి అభిమాన సినిమా వచ్చిదంటే చాలు పండగే.. అలాంటి హీరోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. అయితే అసలే స్టార్ హీరోస్. చాలా బిజీ జీవితం.. క్షణం తీరిక ఉండదు. అలాంటి స్టార్స్ వారి సోషల్ మీడియా అకౌంట్స్‌ను వాళ్లే చూస్తారా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఇంతకీ వారి అకౌంట్స్‌ను వాళ్లే హ్యాండిల్ చేస్తారా..? అనే విషయాన్ని తెలుసుకుందాం.
సాధారణ హీరోలే షూటింగ్స్‌లో చాలా బిజీగా ఉంటారు. అలాంటిది స్టార్ హీరోల మాటకొస్తే.. వాళ్లకు క్షణం తీరక ఉండదని చెప్పాలి. ఒకవేళ ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్లకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది ఆ అకౌంట్స్‌ను వారే హ్యాడిల్ చేస్తారని అనుకుంటారు. అసలే టైం ఉండదంటే.. వాళ్లకు విషయాలను షేర్ చేసుకునే టైం ఎక్కడుంటుంది చెప్పండి అందుకే వారి సోషల్ మీడియా అకౌంట్స్‌ను వారి పీఆర్‌లు నిర్వహిస్తూ ఉంటారు.
హీరోలు మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ లకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొందరు వారి జీవితంలో జరిగే విషయాలను అభిమానులతో పంచుకుంటే.. మరికొందరు సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంటారు. అయితే వారి అకౌంట్స్‌లో పెట్టే పోస్టులను వారి పీఆర్ లేదా ఏజెన్సీలు వాటిని హ్యాండిల్ చేస్తాయని సమాచారం. తాజాగా సుకుమారన్ మాటలతో ఈ విషయం స్పష్టమైంది.
స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉంటారు ప్రభాస్. ఈ స్టార్ హీరోకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన లైఫ్ స్టైల్ గురించి అరుదుగా పంచుకునే ప్రభాస్.. సినిమాలకు సంబంధించిన విషయాలపై అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. సాహో విడుదలకు ముందు ఇన్ స్టాలోకి అడుగుపెట్టిన ప్రభాస్‌ను ప్రస్తుతం 13 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ పై నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రభాస్ పెద్ద స్టార్ అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు. స్టార్ డమ్ గురించి అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్ స్టా నుంచి వచ్చే పోస్టులు షేర్ చేసేది కూడా ఆయన కాదన్నారు సుకుమారన్. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి. అతనికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం. ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటారు. అసలు మొబైల్ లేని ప్రదేశానికి వెళ్లి హాయిగా గడపాలి అని భావిస్తారు. అంత పెద్ద హీరో అయి ఉండి చిన్న చిన్న ఆనందాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు.
ప్రభాస్ ఇన్ స్టా వాడరని.. పీఆర్‌లు నిర్వహిస్తారని పృథ్వీరాజ్ ఓపెన్‌గా చెప్పేశారు. స్టార్ హీరోలను కలవడం కుదరదు కాబట్టి.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తారని భావిస్తారు. అయితే ప్రభాస్ ఫోన్ వాడరు. సోషల్ మీడియా వాడరు అనే వార్త అభిమానులు నిరాశ పరిచేలా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నారు.