Rajamouli: కీలక నిర్ణయం తీసుకున్న జక్కన్న.. మహేష్‌ మూవీ షూటింగ్‌ స్పాట్‌కి వాటిపై నిషేధం

Mahesh Babu and SS Rajamouli Film: ఈ సినిమా షూటింగ్‌ కోసం ఏకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

Update: 2025-02-17 06:57 GMT

Rajamouli: కీలక నిర్ణయం తీసుకున్న జక్కన్న.. మహేష్‌ మూవీ షూటింగ్‌ స్పాట్‌కి వాటిపై నిషేధం

Mahesh Babu and SS Rajamouli Film: అపజయం ఎరగని రాజమౌళి మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాహుబలి, ట్రిపులార్‌తో తెలుగు సినిమా స్థాయిని నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లిన జక్కన్న ఇప్పుడు మహేష్‌ బాబుతో చేయనున్న సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే మహేష్‌ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ కోసం ఏకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం జక్కన్న ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మూవీ కథ సిద్ధమైందని, అమెజాన్‌ అడవుల నేపథ్యంలో కథ ఉండనుందన్న వివరాలు తప్ప మరే సమాచారం లేదు.

ఇక ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి చిత్ర యూనిట్‌కు ఓ కండిషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభ షూటింగ్‌లో ఏకంగా 1000 మంది పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో సినిమా షూటింగ్ జరిగే ప్రదేశానికి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ తీసుకురాకూడదనే కండిషన్‌ పెట్టారంటా.

సరిగ్గా సమ్మర్‌లో షూటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంత మంది ఒకేసారి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తే పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉందన్న కారణంతోనే జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి బదులుగా గాజు సీసాలను మాత్రమే ఉపయోగించాలని కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News