Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ఇండోనేషియా బ్యూటీ?

Mahesh Babu: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హాలీవుడ్ కూడా రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఎదురుచూస్తుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ఇండియా మొత్తం తెలిసేలా చేసారు.

Update: 2024-01-07 14:30 GMT

Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ఇండోనేషియా బ్యూటీ?

Mahesh Babu: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హాలీవుడ్ కూడా రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఎదురుచూస్తుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ఇండియా మొత్తం తెలిసేలా చేసారు. తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తో గాన వియజం సాధించడమే కాకుండా ఆస్కార్ లో ఒరిజినల్ సాంగ్ అవార్డు గెలుచుకున్న సంగతి కూడా తిలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కంబినేషన్లో వస్తున్న సినిమా గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి ప్రీప్రోడుక్షన్ పనుల్లో వున్నా రాజమౌళి ,మహేష్ బాబుకి జోడి గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని ఎదురుచూస్తున్నారు.

కాగా మహేష్ బాబు కి జోడిగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లెన్ ని సెలెక్ట్ చేశారు అంటూ సోషల్ మీడియా లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అంతే కాకుండా స్క్రీన్ టెస్ట్ కూడా అయిపోయింది అని వినిపిస్తుంది.

''ఇండియానా జోన్స్'' మాదిరిగా ''యాక్షన్ అడ్వెంచర్ జానర్'' గా రాబోతున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసేందుకు అమెరికాలోని ఓ కొత్త కాస్టింగ్ ఏజెన్సీ సహాయం తీసుకున్నాడని, దాని ద్వారా చెల్సియా ఇస్లాయిన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News