లీక్ చేశారంటే మూల్యం తప్పదు.. రాజమౌళి మాస్ వార్నింగ్..!

రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. మహేష్ బాబు హీరోగా SSMB29 రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది.

Update: 2025-01-28 07:40 GMT

లీక్ చేశారంటే మూల్యం తప్పదు.. రాజమౌళి మాస్ వార్నింగ్..!

SSMB29 Movie: రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. మహేష్ బాబు హీరోగా SSMB29 రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అన్నప్పటి నుంచి ఆ అంచనాలను అందుకోవడం కాస్త కష్టంగానే ఉంది. ఇక రాజమౌళి ఈ సినిమా విషయంలో సీక్రెట్ మెయింటైన్‌ చేయడంతో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తోంది.

మహేష్ బాబు SSMB29 సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. చిత్ర యూనిట్‌కి కొన్ని షరతులు పెట్టారని.. హీరోతో సహా సెట్ లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ సమాచారం బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్లు సహా చిత్ర యూనిట్‌ కి హెచ్చరికలు జారీ చేసినట్టు టాక్. అంతేకాదు వారితో నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్టు కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటీవల రాజమౌళి తన సినిమా కోసం ఓ సింహాన్ని లాక్ చేసినట్టు ఓ పోస్టు పెట్టారు. అందులో ఓ పాస్ పోర్టును చూపించారు. అంటే మహేష్ బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని ఆ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.అలాగే షూటింగ్ షూరూ అయిందని హింట్ కూడా ఇచ్చారు. ఈ పోస్టుకు స్పందించిన మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చారు. ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ పెట్టారు.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్ట్‌ల గురించి ఇప్పటి వరకు ఏ వార్త బయటకు రాలేదు. కథ విషయంలో కూడా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే తప్ప దర్శకుడిగా రాజమౌళి ఎక్కడా నోరు విప్పలేదు. జస్ట్ సినిమా జానర్ మాత్రం చెప్పారు. సినిమా సంబంధించి ఒక్క విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఓపెనింగ్ రోజు అల్యూమీనియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో కెమెరాలను సైతం అనుమతించలేదు. దీంతో ఓపెనింగ్ ఎలా జరిగింది. ఎవరు వచ్చారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లతో తెరకెక్కనుందని సమాచారం. అందువల్ల ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క సమాచారం లీక్ కాకుండా చూస్తున్నారు రాజమౌళి. ఇందులో భాగంగానే తమ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు నెటిజన్లు. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి.

Tags:    

Similar News