Smriti Irani : బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన మాజీ కేంద్ర మంత్రి.. రోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటారంటే ?

ఒకప్పుడు బుల్లితెరను ఒక ఊపు ఊపిన సీరియల్ క్యూంకి సాస్ భీ కభీ బహు థీ. ఈ సీరియల్‌లోని ప్రతి పాత్ర చాలా పాపులారిటీ పొందింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ సీరియల్ రెండవ భాగం క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2025-08-10 10:30 GMT

Smriti Irani : బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన మాజీ కేంద్ర మంత్రి.. రోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటారంటే ?

Smriti Irani : ఒకప్పుడు బుల్లితెరను ఒక ఊపు ఊపిన సీరియల్ క్యూంకి సాస్ భీ కభీ బహు థీ. ఈ సీరియల్‌లోని ప్రతి పాత్ర చాలా పాపులారిటీ పొందింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ సీరియల్ రెండవ భాగం క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా నటి స్మృతి ఇరానీ బుల్లితెర మీదకు రీఎంట్రీ ఇవ్వడం పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్మృతి ఇరానీ బుల్లితెరలోకి తిరిగి రావడంతో ఆమె రెమ్యునరేషన్ గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. స్మృతి ఇరానీ ఇప్పుడు ఇతర టీవీ నటులందరినీ అధిగమించి, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నిలిచారు.

ఒక కాల్‌షీట్‌కు స్మృతి ఇరానీ ఏకంగా రూ.14 లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను రికార్డు స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని ఆమె ధృవీకరించారు. తాను చేసిన కఠోర శ్రమ, అలాగే టీఆర్‌పీ రేటింగ్‌ల ఆధారంగానే ఇంత మొత్తంలో అందుకుంటున్నానని స్మృతి ఇరానీ చెప్పారు. వేతనంలో సమానత్వాన్ని ఆమె బలంగా నమ్ముతారు.. అందుకే తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు.

నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్ భారతీయ బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్‌లలో ఒకటి. ఇది జూలై 3, 2000 నుంచి నవంబర్ 6, 2008 వరకు స్టార్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమైంది. ఈ సీరియల్ మొత్తం 1,800 ఎపిసోడ్‌లు ప్రసారమైంది. ఇందులో స్మృతి ఇరానీ తులసి విరానీ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. స్మృతి ఇరానీ నటిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆమె ఓడిపోవడంతో మళ్లీ బుల్లితెరలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆమె క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2 సీరియల్‌లో నటిస్తున్నారు.

Tags:    

Similar News