బాలయ్య వ్యక్తిత్వంపై టీజే టిల్లు కామెంట్స్.. సొంతం అనుకుంటే ఎంతదూరమైనా వెళ్తారు..
Nandamuri BalaKrishna: బాలకృష్ణ ఒక సూపర్ హ్యూమన్ అంటున్న సిద్దు జొన్నలగడ్డ
Nandamuri BalaKrishna: బాలకృష్ణ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్న యువ హీరో
Nandamuri Balakrishna: ఒకవైపు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో కరియర్ లో ముందుకు దూసుకుపోతున్న సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరోవైపు "అన్ స్టాపబుల్" వంటి సెలబ్రిటీ టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా నచ్చేస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ఈ షో రెండవ సీజన్ కి ఒక ఎపిసోడ్లో యువ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ లు గెస్ట్లుగా విచ్చేశారు. ఇద్దరు యువహీరులతో చాలా సరదా సరదాగా ఇంటర్వ్యూ పూర్తి చేశారు బాలకృష్ణ.
తాజాగా ఈ నేపథ్యంలోనే "వీరసింహారెడ్డి" సక్సెస్ మీట్ కి కూడా వెళ్లిన సిద్దు జొన్నలగడ్డ బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిద్దు జొన్నలగడ్డ మరొకసారి బాలకృష్ణ గురించి మరియు ఆయన గొప్పతనం గురించి ప్రస్తావించారు. "బాలకృష్ణ గారు ఒక సూపర్ హ్యూమన్. ఆయనకి ఒక మంచి ఆరా ఉంటుంది. ఆయన మనసు చాలా పెద్దది. నా అనుకున్న వాళ్లకోసం ఆయన ఎంత దూరమైనా వెళతారు, ఏమైనా చేస్తారు.
ఆయన ఒక చిన్న పిల్లాడి లాంటివారు. ఆయన మనసు అందంగా, దయ కలిగి ఉంటుంది," అని బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక సినిమాలపరంగా చూస్తే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తన బ్లాక్ బస్టర్ సినిమా "డీ జే టిల్లు" సినిమాకి సీక్వెల్ గా "టిల్లు స్క్వేర్" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.