Vijay Deverakonda : నేషనల్ హైవేపై విజయ్ దేవరకొండ కారు యాక్సిడెంట్.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
Vijay Deverakonda : నేషనల్ హైవేపై విజయ్ దేవరకొండ కారు యాక్సిడెంట్.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన
Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇటీవల కాలంలో నటి రష్మికతో విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు బాగా వినిపిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, నేషనల్ హైవే 44పై వరసిద్ధి వినాయక కాటన్ మిల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం (అక్టోబర్ 6) నాడు విజయ్ దేవరకొండ పుట్టపర్తికి వెళ్లారు. అక్కడ స్కూల్లో చదువుకున్న ఆయన, సత్యసాయి బాబా సమాధిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతుండగా, గద్వాల్ జిల్లాలోని ఉండవల్లి వద్ద నేషనల్ హైవే 44పై ఆయన కారు ప్రమాదానికి గురైంది.
విజయ్ దేవరకొండతో పాటు ఆయన అసిస్టెంట్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అండీ శ్రీకాంత్ కూడా కారులో ఉన్నారు. వారి కారుకు ముందు వెళ్తున్న ఒక ట్రక్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనక వస్తున్న విజయ్ దేవరకొండ కారు దానికి ఢీ కొట్టింది. ఈ కారణంగా విజయ్ దేవరకొండ కారుకు కొంత నష్టం జరిగింది.
ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ, ఆయనతో పాటు ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా ఉన్నారు. కారు డ్రైవర్ అండీ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత, విజయ్ దేవరకొండ మరొక కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
అర్జున్ రెడ్డి, లైగర్, కింగ్‌డమ్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు ఉంది. ఆయన చాలా సంవత్సరాలుగా రష్మికతో సన్నిహితంగా ఉన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చినా, కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.