OTT Movie: రాణిని కాటేసిన రాజద్రోహం: బిచ్చగాళ్లకు బహుమతిగా.. ఓటీటీలో సంచలన చిత్రం!

OTT Movie: ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్'లో ప్రస్తుతం ఓ అరుదైన ఫ్రెంచ్ చలనచిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.

Update: 2025-03-27 07:57 GMT

OTT Movie: రాణిని కాటేసిన రాజద్రోహం: బిచ్చగాళ్లకు బహుమతిగా.. ఓటీటీలో సంచలన చిత్రం!

OTT Movie: ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్'లో ప్రస్తుతం ఓ అరుదైన ఫ్రెంచ్ చలనచిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. "షెహరజాడే" (Sheharazade) అనే పేరుతో 1963లో విడుదలైన ఈ చిత్రం, అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పీటర్ గాస్పార్డ్-హ్యూట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, "వన్ థౌజండ్ అండ్ వన్ నైట్స్" కథల స్ఫూర్తితో తెరకెక్కింది. అన్నా కరీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 809 నాటి బాగ్దాద్ రాజ్యంలో సాగుతుంది.

కథలోకి వెళితే.. కాలిఫ్ హరౌన్-అల్-రషీద్ పరిపాలనలో ఉన్న బాగ్దాద్‌లో, షెహరజాడే అనే అందమైన యువతిని పవర్ ఫుల్ సుల్తాన్‌కు బహుమతిగా అర్పిస్తారు. దీనికి ప్రతిఫలంగా, పవిత్ర ప్రదేశాలకు స్వేచ్ఛగా వెళ్లే అనుమతిని పొందుతారు. అయితే, సుల్తాన్ సహాయకుడు రెనాడ్ డి విల్లెక్రోయిక్స్ ఆమెను ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఈ సంఘటనతో, షెహరజాడే రెనాడ్‌పై ప్రేమలో పడుతుంది.

సుల్తాన్ కూడా షెహరజాడేను ఇష్టపడటంతో, వారిరువురినీ బంధిస్తాడు. ఆమెను రాణిని చేయాలనే సుల్తాన్ కోరికకు అడ్డుగా నిలిచినందుకు, ఆమెను కొరడాలతో కొట్టి, తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. అయితే, అక్కడికి వచ్చిన బిచ్చగాళ్లు ఆమెను బహుమతిగా అడుగుతారు. వారి చట్టం ప్రకారం, తప్పు చేసినవారిని వారికి అప్పగించే అధికారం సుల్తాన్‌కు ఉంటుంది. దీంతో, సుల్తాన్ ఆమెను వారికి బహుమతిగా ఇస్తాడు.

రెనాడ్ అనుచరులు ఆమెను బిచ్చగాళ్ల నుంచి రక్షిస్తారు. సుల్తాన్ నుంచి తప్పించుకున్న రెనాడ్, షెహరజాడేను కలుస్తాడు. ఇద్దరూ కలిసి దూర ప్రాంతానికి వెళ్లి, సంతోషంగా జీవించాలని నిర్ణయించుకుంటారు. చివరకు, షెహరజాడే తన ప్రేమను ఎవరితో పంచుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. 1963లో ఫ్రాన్స్‌లో విడుదలైన ఈ చిత్రం, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News