Actress: దుస్తులు మార్చుకుంటుండగా ఆ దర్శకుడు డోర్ తీశాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Shalini Pandey: ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది అందాల తార షాలినీ పాండే. ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది.
Actress: దుస్తులు మార్చుకుంటుండగా ఆ దర్శకుడు డోర్ తీశాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Shalini Pandey: ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది అందాల తార షాలినీ పాండే. ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించిందీ బ్యూటీ. అయితే అర్జున్ రెడ్డి స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాలినీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలో ఓ దక్షిణాది సినిమాకు పని చేస్తున్న సమయంలో, దర్శకుడు తన అనుమతి లేకుండా కారవాన్ డోర్ తెరిచాడని, అప్పుడు తనకి తీవ్రమైన కోపం వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తాను దుస్తులు మార్చుకుంటున్నానని, వెంటనే గట్టిగా కేకలు వేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
అయితే చుట్టూ ఉన్న కొంతమంది ఆ చర్యను తప్పుపట్టినప్పటికీ, తాను చేసింది సరైందేనని భావించినట్లు షాలినీ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత అలాంటి ఘటనలు ఎదురుకాలేదని, అయినా అటువంటి పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో ఇప్పుడు తెలుసుంది షాలినీ. ఇక షాలినీ కెరీర్ విషయానికొస్తే జబల్‌పూర్‌కి చెందిన ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటోలు చూసి ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇది నిజమో కాదనే అనుమానంతోనే ఫొటోలు పంపినట్లు చెప్పుకొచ్చింది. అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయని, దర్శకులు, నటీనటుల నుంచి మంచి సహకారం లభించిందని తెలిపింది. ఇక షాలినీ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘డబ్బా కార్టెల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.