షారూఖ్ ఖాన్ వాచ్‌పై అందరి చూపు.. ఇంతకీ దాని కాస్ట్ ఎంతో తెలుసా?
సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా వారు వాడే డ్రస్సులు, షూస్, వాచ్‌లు, కార్లు ఇలా ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటాయి.
షారూఖ్ ఖాన్ వాచ్‌పై అందరి చూపు.. ఇంతకీ దాని కాస్ట్ ఎంతో తెలుసా?
Shahrukh Khan: సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా వారు వాడే డ్రస్సులు, షూస్, వాచ్‌లు, కార్లు ఇలా ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు అత్యంత ఖరీదైన వస్తువులను ధరిస్తూ వారి ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి వారు ధరించే వస్తువుల ధరలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ చేతికి పెట్టుకున్న వాచ్ వైరల్ అవుతోంది. దీంతో ఆ వాచ్ కాస్ట్ ఎంత.. ఏ కంపెనీ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
షారూఖ్ ఖాన్ ఇటీవల ఓ బాలీవుడ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ అందర్నీ ఆకట్టుకుంది. ఇంతకీ అంతలా ఆకట్టుకోవడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే ఉంది అసలు విషయం. అది మామూలు వాచ్ కాదు. అడెమర్స్ పిగట్ వాచ్. 18 క్యారెట్ శ్యాండ్ గోల్డ్‌తో ఈ వాచ్ తయారైనట్లు తెలుస్తోంది. ఈ మోడల్ వాచ్ ప్రపంచం మొత్తం మీద కేవలం 250 మంది వద్ద మాత్రమే ఉన్నట్టు సమాచారం.
ఒక్కొక్క వాచ్ ధర అక్షరాల రూ.76 లక్షల పై మాటే. ఈ విషయం తెలిసిన కొందరు అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం బాలీవుడ్ బాద్‌షా అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక షారూఖ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గతంలో లాగా వరుస సినిమాలు చేయకుండా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లీడ్ రోల్‌లో చేస్తున్న సినిమాలోనూ షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇక అలాగే షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ బాద్‌షాగా గుర్తింపు తెచ్చకున్న షారూఖ్ ఖాన్ లానే ఆయన వారసులు కూడా అదే రేంజ్‌లో ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.