Sashi Movie Trailer: 'శ‌శి' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Sashi Movie Trailer: ఆది హీరోగా నటిస్తున్న‘శ‌శి’ సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు విడుద‌ల చేశారు.

Update: 2021-03-10 06:14 GMT

ఇమేజ్ సోర్స్: మూవీ స్పీయే

Sashi Movie Trailer: ఆది హీరోగా నటిస్తున్న'శ‌శి' సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో ఆది సరసన సుర‌భి, రాశీసింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని 'ఒకే ఒక లోకం' పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది.

సినిమాకు అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో ఆది సాయి కుమార్ లుక్ కొత్తగా ఉంది. ఇదొక రగ్డ్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. 'మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి' 'ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువే అని అర్థం అవుతోంది. మొత్తం మీద పవర్ స్టార్ వదిలిన ఈ పవర్ ఫుల్ ట్రైలర్ డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆడియన్స్ ని అలరిస్తోంది.

Tags:    

Similar News