"అర్జున్ రెడ్డి" డైరెక్టర్ తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

* "అర్జున్ రెడ్డి" డైరెక్టర్ తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

Update: 2023-03-10 09:37 GMT

మరొక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్

Sandeep Vanga: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సందీప్ వంగా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ ఒక్క సినిమా అనుభవంతోనే బాలీవుడ్ కి కూడా వెళ్ళిపోయాడు. హిందీలో కూడా "అర్జున్ రెడ్డి" సినిమాని "కబీర్ సింగ్" అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించిన సందీప్ ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా "స్పిరిట్" అనే ప్యాన్ ఇండియా సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు సందీప్ వంగా.

తాజా సమాచారం ప్రకారం సందీప్ ఇప్పుడు మరొక స్టార్ హీరో తో సినిమాని లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తోంది. "పుష్ప" సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో అల్లు అర్జున్ సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ ఉంది. దీనికి సందీప్ వంగా డైరెక్టర్ అయితే బాగుంటుందని అల్లు అర్జున్ అనుకుంటున్నారట. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన కథ మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు. గతంలో వేణు శ్రీరామ్, దిల్ రాజు, కొరటాల, లింగస్వామి వంటి వారితో కూడా సినిమాలు అనౌన్స్ చేసిన బన్నీ ఆ సినిమాలు పట్టాలెక్కించలేదు. మరి సందీప్ గా డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాలి.

Tags:    

Similar News