విజయ్ దేవరకొండ తో కచ్చితంగా సినిమా ఉంటుంది అంటున్న సందీప్ వంగా

Sandeep Reddy Vanga: మళ్ళీ రిపీట్ అవ్వబోతున్న అర్జున్ రెడ్డి కాంబినేషన్

Update: 2023-02-20 07:34 GMT

విజయ్ దేవరకొండ తో కచ్చితంగా సినిమా ఉంటుంది అంటున్న సందీప్ వంగా

Sandeep Reddy Vanga: "అర్జున్ రెడ్డి" వంటి కల్ట్ సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. విడుదలకి ముందు ఎన్నో వివాదాలలో ఇరుక్కున్న ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక ఈ సినిమాని షాహిద్ కపూర్ హీరోగా హిందీలో "కబీర్ సింగ్" అనే టైటిల్ తో రీమేక్ చేసిన సందీప్ వంగా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.

తాజాగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సందీప్ రెడ్డి వంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించి, సినిమాల గురించి చెప్పుకొచ్చిన సందీప్ రెడ్డి వంగా విజయ్ తో మళ్లీ సినిమా ఏమైనా ఉంటుందా అని అడగగా వెంటనే కచ్చితంగా ఉంటుందని, ఆల్రెడీ అంతకు ముందు నుంచే ఒక ప్లాన్ ఉందని అది తొందరలోనే వర్కౌట్ చేస్తామని అన్నారు సందీప్.

అర్జున్ రెడ్డి వంటి సినిమా తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ మరియు సందీప్ వంగా ల కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ శివ నిర్వాన దర్శకత్వంలో "ఖుషీ", గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News