Samantha: అందుకు సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: ప్రస్తుతం సమంత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. తనకే మొదట ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మొదటి స్థానంలో పెడుతున్నారు.

Update: 2025-04-14 05:56 GMT

Samantha: అందుకు సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: ప్రస్తుతం సమంత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. తనకే మొదట ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మొదటి స్థానంలో పెడుతున్నారు. నచ్చినట్టే జీవిస్తున్నారు. నచ్చిన కథలు, పాత్రలే ఒప్పుకుంటున్నారు. మహిళా సాధికారత, వ్యక్తిగత సంరక్షణ వంటి విషయాలపై సోషల్ మీడియా వేదికగా సందేశాలు అందిస్తున్నారు. దీన్ని ఆమె బాధ్యతగా భావిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..“ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లైంది. ఆ సమయంలో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాం, ఎన్ని బ్రాండ్లకు అంబాసడర్‌గా ఉన్నాం అనే విషయాలే స్టార్‌డమ్‌కి కొలమానం. ఆ దశలో ఊపిరాడకుండా సినిమాలు చేశాను. అప్పట్లో నాకు గర్వంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ భావన మారింది. మనసు ఎదిగింది. సమాజంపై బాధ్యత పెరిగింది,” అన్నారు సమంత.

తన చేతుల మీదుగా ఏదైనా సమాజానికి నష్టం జరిగితే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. “పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఓ దశలో కొన్ని ఉత్పత్తులను ప్రమోట్‌ చేశాను. అవి ప్రజలకు హానికరం అయ్యే అవకాశముందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించాను. అందుకే వాటికి సంబంధించి సమాజానికి క్షమాపణ చెబుతున్నా,” అని చెప్పుకొచ్చారు.

“గత ఏడాదిలోనే కోట్లలో డబ్బు ఇస్తామన్నా దాదాపు 15 బ్రాండ్స్‌ని వదిలేశాను. ప్రస్తుతం ఏ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలా అనే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాను. ముందు వైద్యుల సలహా తీస్తా. ఆ ఉత్పత్తులు ప్రజలకు మేలు చేస్తాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతే ఒప్పుకుంటా,” అన్నారు.

ఇక సినిమాల విషయంలోనూ ఆమెకు స్పష్టత ఉంది. “ప్రతి సినిమా చేయడం కాదు. కథలో పాత్రకు విలువ ఉంటేనే చేస్తాను. అలాంటివి రాకపోతే నేనే నిర్మించుకుని సినిమాలు తీస్తా. ఆత్మవంచన చేసుకొని సినిమాలు చేయనూ,” అన్నారు. ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె నిర్మించిన ‘శుభం’ అనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News