Samantha Raj Nidimoru wedding: మూడుముళ్ల సాక్షిగా..పెళ్లి చేసుకున్న సమంత, రాజ్
పెళ్లి చేసుకున్న సమంత, రాజ్ కొంతకాలంగా రిలేషన్‌లో సామ్, రాజ్ ఇవాళ ఉదయం వివాహ బంధంతో ఒక్కటి కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్న సమంత, రాజ్
మూడుముళ్ల సాక్షిగా..పెళ్లి చేసుకున్న సమంత, రాజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న వీరిరువురు ఇవాళ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా పౌండేషన్ యోగా సెంటర్‌లో సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, రాజ్ మొదటి భార్య శ్యామలి సోషల్ మీడియాలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఏమాయ చేసావె' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ఈ జంట ప్రకటించింది. టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి. విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. అయితే, యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్‌కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది.
రాజ్ - సామ్ రిలేషన్ షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. చెన్నై పికిల్ బాల్ టీమ్‌కి వీరిద్దరూ కో ఓనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా, సామ్ 1987లో పుట్టారు. రాజ్ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు.