Samantha: మూడు కోట్లు కావాలి అంటున్న సమంత

Samantha: ఒక్కసారిగా రెమ్యునరేషన్ని పెంచేసిన హీరోయిన్

Update: 2021-11-08 15:00 GMT
తన రెమ్యూనరేషన్ పెంచిన సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అప్పటినుంచి టాలీవుడ్ బ్యూటీ సమంత తన కెరియర్ మీద మరింత దృష్టి పెట్టటం మొదలు పెట్టింది. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమంత తాజాగా ఇప్పుడు దర్శక నిర్మాతలకి తన పారితోషికంతో షాక్ ఇస్తోంది. పారితోషికం విషయంలో ఇంతకు ముందు కంటే సమంత ఇప్పుడు మరింత పట్టుదలగా ఉందని టాలీవుడ్ వర్గాల భోగట్టా. తాజా సమాచారం ప్రకారం సమంత ఈ మధ్యనే ఒక రెండు కొత్త సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒక్కో సినిమా కోసం తను మూడు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

నిజం చెప్పాలంటే గత కొంత కాలంగా సమంత తెలుగు తెరపై కనిపించింది లేదు. ఈ మధ్యనే విడుదలైన "ఓ బేబీ" సినిమా కూడా అంతంతమాత్రంగానే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ను చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ తన రూటు మార్చిన సమంత సరికొత్త కథలను వింటూ మంచి సినిమాలకు మాత్రమే ఓకే చెపుతోందట. ఎంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఏకంగా మూడు కోట్లు ఇచ్చి మరీ సమంత హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావటం లేదు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న వంటి హీరోయిన్లు సినిమాకి రెండు కోట్ల దాకా డిమాండ్ చేస్తుండగా ఈ సమయంలో సమంత మూడు కోట్లు అడగడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

Tags:    

Similar News