Samantha: మొదటి సినిమా హీరోతో సినిమా ఓకే చేసిన సమంత
Samantha: హీరో దర్శకత్వంలో సినిమా ఓకే చేసిన సమంత
Samantha: మొదటి సినిమా హీరోతో సినిమా ఓకే చేసిన సమంత
Samantha: "యశోధ" సినిమా విడుదలకు ముందు స్టార్ బ్యూటీ సమంతా దాదాపు ప్రతి సినిమాకి చిన్మయ్ శ్రీపాద డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ చెప్పేది. కానీ ఈ మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న సామ్ "యశోద" సినిమాకి కూడా తానే డబ్బింగ్ చెప్పుకుందని సమాచారం. అయితే సినిమా విడుదలైన తర్వాత చిన్మయి భర్త నటుడు మరియు దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి సమంత మొదటి సినిమా చేసింది రాహుల్ తోనే. "మాస్కోవిన్ కావేరి" అనే సినిమాలో జంటగా నటించినప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. అప్పటికి చిన్మయి రాహుల్ ని ఇంకా కలవను కూడా కలవలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు సమంత హీరోయిన్ గా ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది. గతంలో రాహుల్ రవీంద్రన్ రష్మిక మందన్నకు కథ చెప్పాడని వార్తలు వినిపించాయి. కానీ రష్మీక సినిమాను రిజెక్ట్ చేసింది. కానీ అదే కథను విన్న సమంత మాత్రం వింటున్నపుడే చాలా ఎగ్జైట్ అయ్యిందని, వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విజయ్ దేవరకొండ తో "ఖుషి" మరియు వరుణ్ ధావన్‌తో వెబ్ సిరీస్ మరియు తన ఇతరత్రా కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత సమంత ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకు వెళతాడని సమాచారం. ఇక సమంత ఆరోగ్య పరిస్తితి కూడా ఇంకా బాగు పడాల్సి ఉంది.