RGV Clarity on Pawan Kalyan Biopic: అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే!

RGV Clarity on Pawan Kalyan Biopic: రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మంచి స్పీడ్ లో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలని పక్కన పెడితే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

Update: 2020-07-06 07:48 GMT

RGV Clarity on Pawan Kalyan Biopic: రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మంచి స్పీడ్ లో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలని పక్కన పెడితే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ అనే సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో భాగంగానే పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాని చేస్తున్నట్టుగా వర్మ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశాడు వర్మ.. అయితే తమ అభిమాన నటుడు పేరుతో ఉన్న బిరుదుతో వర్మ సినిమా చేస్తున్ననని ప్రకటించడంతో పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో వర్మపై మండిపడుతున్నారు.

అయితే దీనిపైన వర్మ స్పందించాడు.. " నేను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ టాప్‌ సినీ స్టార్.. అనంతర పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుద్దికుంటోంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే.. " ఇక ఇదంతా మీడియా సృష్టే అంటూ పవన్ బయోపిక్ వార్తల్ని కొట్టిపారేశాడు వర్మ..


Tags:    

Similar News